అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం…

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ అనాధాశ్రమం నుండి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారు కరోనాతో చనిపోయారని నాటకం ఆడారు ట్రస్ట్ నిర్వాహుకులు. మధురై జిల్లా మేలూరులోని “ఇదయం” ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పిల్లలను అమ్మకానికి పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. వారం క్రితం ఓ బాలుడ్ని ఐదు లక్షల విక్రయించారు ట్రస్ట్ సభ్యులు. అ బాలుడి తల్లి బాబును చూడటానికి వచ్చినప్పుడు కరోనాతో మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు సిబ్బంది. ఆ తల్లి ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ట్రస్ట్ నిర్వాహకులు శివకూమార్,మదర్షా పరారయ్యారు. ఇప్పటివరకు మొత్తం 60 కి పైగా పిల్లలు అదృశ్యం అయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ ట్రస్ట్ వెనుక భారీ రాకెట్ ఉన్నట్లు గుర్తించారు.