గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళి తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గింది. దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధర తగ్గింది. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాట పట్టడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.20 తగ్గింది. దీంతో రూ.39,150 నుంచి రూ.39,130కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,640 వద్దనే నిలకడగానే ఉంది. బంగారం ధర దారిలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గడంతో ధర రూ.49,550 నుంచి రూ.49,500కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,130కు పడిపోయింది. వెండి ధర రూ.49,500కు తగ్గింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. రూ.41,150 వద్దనే ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.39,950 వద్దనే కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.49,500కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.41 శాతం తగ్గడంతో 1,592.75 డాలర్లకు పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1.06 శాతం పెరుగుదలతో 17.92 డాలర్లకు చేరింది.

Image result for gold rate

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation