గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

98

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర రూ.170 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,310 నుంచి రూ.45,140కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.170 మేర తగ్గింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.41,530 నుంచి రూ.41,360కు చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.180 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.50,030 నుంచి రూ.49,850కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 1651.25 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.41,360కు పడిపోయింది. వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.150 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.42,400 నుంచి రూ.42,250కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.43,600 నుంచి రూ.43,450కు చేరింది. ఇక వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు పడిపోయింది.

Image result for gold rate

బంగారం ధర పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation