గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

102

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మళ్ళీ తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,330 తగ్గుదలతో రూ.43,850కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,120 తగ్గుదలతో రూ.40,200కు పడిపోయింది. పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.370 తగ్గడంతో వెండి ధర రూ.48,030కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం 1530 డాలర్ల కిందకు వచ్చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 3.85 శాతం తగ్గుదలతో 1529.10 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 8.20 శాతం తగ్గుదలతో 14.69 డాలర్లకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,050 తగ్గడంతో రూ.41,250కు పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1090 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,260కు పడిపోయింది. వెండి ధర కూడా రూ.400 తగ్గుదలతో రూ.48,550కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Image result for గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర రూ.1,150 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గుదలతో రూ.41,050కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,150 తగ్గడంతో రూ.42,250కు పడిపోయింది. ఇక వెండి ధర రూ.370 తగ్గుదలతో రూ.48,030కు దిగొచ్చింది.బంగారం ధర పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు.

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation