గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గుదలతో రూ.45,800కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో రూ.41,980కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.450 మేర తగ్గడంతో కేజీ వెండి ధర రూ.49,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం 1700 డాలర్ల కిందకు వచ్చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1673.25 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.33 శాతం తగ్గడంతో 16.85 డాలర్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.41,260కు పడిపోయింది. వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర రూ.110 మేర దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.42,850కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.44,050కు తగ్గింది. ఇక వెండి ధర కూడా రూ.450 తగ్గుదలతో రూ.49,500కు పడిపోయింది.

Image result for భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధర పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation