ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన క్రికెటర్స్

202

మ‌న‌దేశంలో క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు, మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరెక్కాడా ఇతర దేశంలో లేదు…. క్రికెట్ అంటే క్రేజే కాదు బిజినెస్ కూడా వేల కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంది, ప్ర‌పంచ వ్యాప్తంగా 20 దేశాలు అన్నింటికంటే క్రికెట్ క్రీడ‌కే ప్ర‌యారిటీ ఇస్తాయి.. క్రికెట్ అంటే మ‌న దేశంలో చాలా క్రేజ్..ఏషియ‌న్ కంట్రీస్ లో మ‌న దేశంలో అభిమానించే అంత‌లా క్రికెట్ మ‌రెక్క‌డా అభిమానించ‌రు.

గతంలో దాదాపు 40 కోట్ల మంది క్రికెట్ కు మన దేశంలో ఫ్యాన్స్ ఉండేవారు, కాని ఇప్పుడు ఆ సంఖ్య 70 కోట్లకు చేరింది అని చెప్పాలి.. గ‌తంలో టెస్ట్ వన్డే ఫార్మెట్లు మాత్రమే ఉండేవి కాని ఇప్పుడు సీన్ మారింది క్రికెట్ ఆట కొత్త రూపు సంతరించుకుంది.. బౌండరీలు ధాటే ఆటలు పరుగులు పెట్టించే రన్స్ మైకం తెప్పించే ఇన్నింగ్స్ మరింత పెరిగాయి అంతా ఐపీఎల్ మానియా అనే చెప్పాలి ఇలా ప్రతీ దేశంలో కొత్త మ్యాచ్ లు పుట్టుకు వచ్చాయి.. అలాగే టీ 20 ఫార్మెట్లు కూడా ప్రతీ బోర్డు కండెక్ట్ చేస్తోంది.. వరల్డ్ కప్ తో సహ టీ 20 వరల్డ్ కప్ కూడా జరుగుతోంది. అయితే క్రీడాకారులు కూడా కోట్ల మందిలో ఓ 20 మంది మాత్రమే మెరుస్తారు లక్ తో పాటు వారి ఆట కూడా ఇక్కడ ముఖ్యం అనే చెప్పాలి.

గతంలో లక్షల రూపాయలు మాత్రమే వచ్చే సంపద ఇప్పుడు వందల కోట్ల రూపాయలకు చేరుకుంది. అకాడమీ, స్పాన్సర్ షిప్, బ్రాండింగ్, యాడ్ మేకింగ్, కనెక్టివీటీ, ఫ్రాంచైజీ ఇలా క్రికెటర్లు కూడా అనేక రకాలుగా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా కొత్త అవుట్ లెట్స్ కొత్త వ్యాపారాలు చేస్తున్నారు, మరి అలాంటి వారిలో రిచెస్ట్ క్రికెటర్స్ ఎవరు, సంపాదనంలో ఎవరు టాప్ అనేది ఇఫ్పుడు తెలుసుకుందాం.

షేన్ వార్న్ స్పిన్నర్లకే స్పిన్నర్ అని చెప్పాలి. ఈ ఆస్ట్రేలియన్ గట్స్ బౌలర్స్ స్పిన్నర్స్ తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. కీలకమైన సమయాలలో వికెట్లు తీయడంలో వార్న్ దిట్ట అని చెప్పాలి.. కొత్త టెక్నిక్స్ తో అదరకొడతాడు.. ఇప్పటి వరకూ వార్న్ 1000 వికెట్లు తీశాడు, ఇక ఫోబ్స్ ప్రకారం ఆయన ఆస్తి మొత్తం 50 యూఎస్ మిలియన్ డాలర్లు, ఇక 2008లో ఐపీయల్ రాజస్ధాన్ జట్టులో ఐకాన్ ప్లేయర్ గా తీసుకున్నారు. ఈ సమయంలో అతనికి జట్టు 4,50,000 యూఎస్ డాలర్లు ఇచ్చింది. ఇక రాజస్ధాన్ జట్టుకు కెప్లెన్ గా ఆయన కప్ సాధించాడు. చివరకు ఐపీఎల్ ఫైనల్ లో గెలిపించాడు.

విరాట్ కోహ్లీ.. బ్రాండింగ్ అంటే విరాట్ అని చెప్పాలి ఎందుకు అంటే అతను క్రికెట్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో తెలుసు ఇప్పుడు కంపెనీలు కూడా బ్రాండింగ్ కోసం అతని వెనుక అలాగే పడుతున్నాయి . కాని రేటింగ్ ప్రకారం, ఫోబ్స్ లిస్ట్ ప్రకారం 53 మిలియన్ డాలర్స్ ఆస్తి విరాట్ కు సొంతం.. ఇక విరాట్ 2008లో అండర్ 19 కి కెప్లెన్ గా చేసి వరెల్ట్ కప్ గెలిచాడు, అలా లైమ్ లైట్ లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ, తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 30 వేల డాలర్లకు తనని జట్టులోకి తీసుకుంది. ఇక క్రికెట్ యాడ్స్ ద్వారా సంపాదించే సంపాదన కోట్ల రూపాయలలో ఉంది. కోహ్లీ ఎక్కువగా ఆర్ఫన్ ఫౌండేషన్ కు విరాళం ఇస్తాడు.. ఇక క్రికెట్ చరిత్రలో ఎమ్మార్ ఎఫ్ ద్వారా కోహ్లీ భారీ డీల్ చేసుకున్నాడు, ప్రతీ ఏడాది కోట్ల రూపాయలు ఎమ్మార్ ఎఫ్ చెల్లిస్తూనే ఉంది.

రిక్కీ పాంటింగ్…

కూల్ కెప్లెన్ గా కంగారుల దేశం పిలుస్తుంది.. కెప్లెన్ గా ఉన్న సమయంలో రిక్కిపాంటింగ్ రెండు వరల్డ్ కప్ లు తీసుకువచ్చాడు…2003-2007లో క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లు రెండు సాధించింది…ఫోబ్స్ లిస్టులో పాంటింగ్ మూడవ రిచెస్ట్ ప్లేయర్ గా వస్తాడు. అతని ఆస్తివిలువ 65 మిలియన్ డాలర్లు. తనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అని చెబుతాడు, ముఖ్యంగా కేన్సర్ పేషెంట్ల బాధలు చూసి కేన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా వారికి వైద్యం అందచేస్తాడు

ధోనీ…
మన దేశంలో కెప్టెన్సీలో బాగా సక్సెస్ అయిన ఆటగాడిగా ధోనికి ఎప్పటికీ రికార్డు అలాగే ఉంటుంది.. కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధీని రిచెస్ట్ పర్సెన్స్ లో రెండో స్ధానంలో ఉంటాడు, అతని ఆస్తి విలువ103 మిలియన్ డాలర్లు.. ఇక ప్రతీ ఏడాది 26.5 మిలియన్ డాలర్లు సంపాదిస్తాడు దోనీ , కాని అతనికి క్రికెట్ నుంచి వచ్చేది మాత్రం కేవలం 3.5 మిలియన్ డాలర్లు మాత్రమే, మిగిలినది అంతా స్పాన్సర్ షిప్, బ్రాండింగ్, యాడ్స్, ఇతర బిజినెస్ ల ద్వారా వస్తోంది.. ఇక క్రికెట్ లో దోనీ అనేక రికార్డులు నమోదు చేశాడు, ప్రపంచ ఫుట్ బాల్ ప్లేయర్స్ , మెస్సి రోనాల్డో లను కూడా సంపాదనలో దాటేశాడు, అంతేకాదు సక్సెస్ ఫుల్ మెన్ గా క్రికెట్ లో కితాబు పొందాడు, ఎందుకు అంటే ఇప్పటి వరకూ భారత్ దోనీ అండర్ లో 100 మ్యాచ్ లు విజయం సాధించింది.

Image result for dhoni'

సచిన్ టెండుల్కర్..
భారత ఆటగాడు అయినా, క్రికెట్ కు సచిన్ ని గాడ్ ఫాదర్ అనే చెబుతారు, ఎన్ని రికార్డులు ఉన్నా అన్నింటిని దాటి సరికొత్త రికార్డులు నమోదు చేసిన భారత మేటి ఆటగాడు సచిన్ అని చెప్పాలి…2013లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి దూరం అయ్యాడు . సచిన్ రిటైర్మెంట్ తీసుకుని ఇంత కాలం అయినా ఇంకా క్రికెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాడు..ఫోబ్స్ లిస్ట్ ప్రకారం సచిన్ ఆస్తి విలువ 180 మిలియన్ డాలర్లు.. సచిన్ ముంబైలో ఓ ఎన్జీవో స్టార్ట్ చేశాడు, అతని సొంత డబ్బులతో 200 మంది పిల్లలని చదివిస్తున్నాడు వారి ఆలన పాలన అంతా తన టీమ్ చూసుకుంటారు. సచిన్ క్రికెట్ లో రాణిస్తున్న సమయంలో ముంబైలో ఖరీదైన ప్రాంతాల్లో రెండు హోటల్స్ స్టార్ట్ చేశాడు, ఒకటి టెండుల్కర్ మాల్, మరొకటి సచిన్ రెస్టారెంట్ మాల్… అంతేకాకుండా సచిన్ యాడ్స్ స్పాన్సర్ షిప్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, మ‌రి ఈ క్రికెట‌ర్స్ లో మీ అభిమాన క్రికెట‌ర్ ఎవ‌రో కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

Content above bottom navigation