ప్ర‌పంచ కుబేరుడు బిల్ గేట్స్ షిప్ ఖ‌రీదు తెలిస్తే షాక్

60

బిల్ గేట్స్…. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు – ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడు. అంత సంపన్నమైన వ్యక్తి … ఆయ‌న వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. తాజాగా బిల్‌గేట్స్‌ ఓ అద్బుతమైన షిప్ ను కొనుగోలు చేశారు… దాని ఖరీదు రూ.4600 కోట్లు… విన‌డానికే మ‌తిపోతుంది క‌దా అవును ఇంత ఖ‌రీదైన షిప్ ఆయ‌న కొనుగోలు చేశారు.

Image result for bill gates ship

ఈ షిప్ పేరు ‘‘ఆక్వా’’అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను బిల్‌గేట్స్‌ 2019లో కొన్నారు. మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఈ అద్భుతమైన షిప్ నమూనాను ఆయన ఎంతో ముచ్చటపడిపోయారు. పైగా అది పర్యావరణ హితమైనదని తెలిసి ఒక ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే కొనేశారు.

ఈ క్రింద వీడియో చుడండి:

నమూనాగా ఉన్న ఆ షిప్ ను చూసిన బిల్ గేట్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుందని తెలియడంతో వెంటనే షిప్ తయారీకి కావాల్సిన డబ్బును బిల్‌గేట్స్‌ ఏమాత్రం ఆలోచించకుండూ ఇచ్చేశారు. వెంటనే షిప్ తయారు చేయమని చెప్పేశారు. ..ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో విహరించాలనుకుంటే ప్రైవేట్‌ యాట్‌లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకునేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

మ‌రి ఆ షిప్ అదే ఈ ఆక్వా స్పెషల్స్ చూద్దాం
370 అడుగుల పొడుగు ఉండే ఈ నౌక పేరు.. ఆక్వా. ఈ షిప్ లో నాలుగు గెస్ట్‌ రూములు. రెండు వీఐపీ రూమ్స్..యజమాని బిల్ గేట్స్ సూట్‌ ఉంటాయి.ఆక్వా వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు..దీంట్లో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. ఆక్వా నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్‌ను మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే. దీంతో సముద్ర జలాలకు ఎటువంటి హానీ జరుగదు.

ఆక్వా నౌకలో సిబ్బంది సంఖ్య 31 ఉంటారు. దీంట్లో 14 మంది గెస్ట్ లకు సేవలు చేస్తుంటారు. వారికి ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లనుంచి అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు ఆక్వాలో జిమ్‌, యోగా చేసుకోవటానికి..ధ్యానం చేసుకోవటానికి స్పెషల్ గా యోగా రూమ్‌, మేకప్‌ రూమ్‌, మసాజ్‌పార్లర్‌, స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉన్నాయి.

ఈ విలాసవంతమైన నౌకలో నుంచి బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లుకూడా అందుబాటులో ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కోదాని పొడుగు 32 అడుగులు.ప్రస్తుతం ఆక్వా షిప్ పూర్తిగా తయారవ్వలేదు. తయారీ దశలోనే ఉంది. 2024 నాటికి బిల్‌గేట్స్‌ చేతికి రానుంది. బిల్ గేట్స్ షిప్పా మజాకా అన్నట్లుగా ఉంది ఈ ‘‘ఆక్వా’’షిప్ నమూనా చూస్తే. ఇప్పుడు ఇలాంటి షిప్ కొనుక్కోవాలి అని చాలా మంది ధ‌న‌వంతులు అనుకుంటున్నారు త‌మ భార్య‌ల‌కు గిఫ్ట్ గా ఇవ్వాలి అని చూస్తున్నారట‌. ఇలాంటి నౌక గతంలో ఇంకెవరికి లేదు. సైనస్ అనే డిజైనర్ దానికి ఒక రూపాన్ని ఇస్తే ..లేటరల్ నేవల్ ఆర్కి టెక్ష్ట్స్ అనే సంస్థ దాన్ని తయారుచేస్తుంది. మ‌రి ఈ ఆక్వాపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

Content above bottom navigation