శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంతంటే

51

రెండు రోజులుగా పెరిగిన బంగారం ధ‌ర నేడు మార్కెట్లో త‌గ్గింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల ట్రెండ్ కారణంగా బంగారం ధర భారీగా త‌గ్గింది. పసిడి పడిపోతే వెండి ధర మాత్రం అలాగే కొనసాగింది. ఎలాంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మ‌రింత తగ్గింది.. దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గింది. దీంతో పసిడి ధర కిందకు దిగింది. రూపాయి బలపడటం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది…గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం త‌గ్గింది. దీంతో 1,579 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 18 డాలర్లకు చేరింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర త‌గ్గింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.38,880 నుంచి రూ.38,840కు దిగొచ్చింది.

అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. రూ.20 డౌన్ ట్రేడ్ అవుతోంది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,390 నుంచి రూ.42,370కు దిగొచ్చింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,000 ద‌గ్గ‌ర స్థిరంగానే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,840కు చేరింది. వెండి ధర రూ.49,000 ద‌గ్గ‌ర‌ స్థిరంగా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.40,850కు త‌గ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 త‌గ్గుద‌ల‌తో రూ.39,650కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.49,000 ద‌గ్గ‌ర‌ స్థిరంగా ఉంది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల ద‌గ్గ‌ర‌ ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు తెలియ‌చేస్తున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation