శుభవార్త.. పడిపోయిన బంగారం ధర

నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గింది. దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధర తగ్గింది. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాట పట్టడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గింది. దీంతో రూ.39,250 నుంచి రూ.39,150కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,780 నుంచి రూ.42,640కు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,550కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,150కు పడిపోయింది. వెండి ధర రూ.49,550కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గింది. దీంతో ధర రూ.41,150కు తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.160 తగ్గుదలతో రూ.39,950కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.49,550కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గడంతో 1,585.10 డాలర్లకు చేరింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 17.79 డాలర్లకు చేరింది.

Image result for gold rate

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation