శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే.

మన దేశంలో ఎక్కువగా మధ్య తరగతి ప్రజలే ఉన్నారు, ఏవైనా నిత్యావసరాల ధరలు పెరిగితే కచ్చితంగా ఎఫెక్ట్ పడితే మధ్య తరగతి ప్రజల మీదనే, ఉల్లిగడ్డల రేట్ పెరిగిన, కూరగాయల రేట్ పెరిగిన, పెట్రోల్ రేట్ పెరిగిన, బస్, రైల్వే చార్జీలు పెరిగిన మధ్య తరగతి, పేద ప్రజలే నష్టపోతుంటారు, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్ లు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి, అప్పుడప్పుడు పెట్రోల్ రేట్ తగ్గినా మళ్లీ పెట్రోల్ రేటును పెంచుతున్నారు. దీంతో పెరిగిన రేట్ల‌తో జ‌నాలు వాహ‌నాల‌ను న‌డ‌ప‌లేక‌పోతున్నారు. అయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. తెలంగాణ, ఏపీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. వాహనదారులకు ఇది ఊరట కలిగించే విషయం.

Image result for శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే.

అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త ఏడాది ఆరంభం నుంచి చూస్తే ముడి చమురు ధరలు భారీగానే దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర జనవరి నెల ప్రారంభంలో, బ్యారెల్‌ కు 66 డాలర్ల సమీపంలో ఉండేది. ఇప్పుడు 53 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. అంటే ధర 13 డాలర్లకు పైన తగ్గింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా బ్యారెల్‌ కు 61 డాలర్ల నుంచి 50 డాలర్లకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు భారీగానే తగ్గాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 కు పైగా తగ్గాయి. పెట్రోల్ ధర రూ.75.25 నుంచి రూ.72.10కు పడిపోయింది.

ఈ క్రింద వీడియో చూడండి:

డీజిల్ ధర 68.10 నుంచి రూ.65.07కు దిగొచ్చింది. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే తగ్గాయి. జనవరి 2న లీటరు పెట్రోల్ ధర 80.04 వద్ద ఉండేది. ఇప్పుడు ఫిబ్రవరి 10న పెట్రోల్ ధర 76.62కు తగ్గింది. అంటే లీటరుకు పెట్రోల్ ధర రూ.3.42 దిగొచ్చింది. పెట్రోల్ ధర బాటలోనే డీజిల్ ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో లీటరు డీజిల్ ధర కూడా ఈ నెలన్నర కాలంలో భారీగానే తగ్గింది. జనవరి 2న లీటరు డీజిల్ ధర 74.28 వద్ద ఉంది. ఇప్పుడేమో ఫిబ్రవరి 10న ధర రూ.70.88కు పడిపోయింది. అంటే లీటరుకు డీజిల్ ధర రూ.3.40 మేర తగ్గింది.

Image result for శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే.

ఆంధ్రప్రదే‌శ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. అమరావతిలో లీటరు పెట్రోల్ ధర కొత్త ఏడాది నుంచి ఫిబ్రవరి 10 వరకు చూస్తే రూ.79.59 నుంచి రూ.76.69కు పడిపోయింది. డీజిల్ ధర రూ.73.49 నుంచి రూ.70.91కు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.9, డీజిల్ ధర లీటరుకు రూ.2.58 తగ్గింది. విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కొత్త ఏడాది ఆరంభంలో లీటరు పెట్రోల్ ధర రూ.79.22 వద్ద ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ధర రూ.76.28కి తగ్గింది. అంటే లీటరుపై ధర రూ.2.94 దిగొచ్చింది. డీజిల్ ధర కూడా 73.15 నుంచి రూ.70.53కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబైలో కూడా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. లీటరుకు రూ.3 మేర తగ్గింది. లీటరు పెట్రోల్ ధర రూ.80.87 నుంచి రూ.77.76కు పడిపోయింది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ.71.43 నుంచి రూ.68.19కు తగ్గింది. ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

Content above bottom navigation