శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.

గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధర ఈరోజు మళ్ళి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.40,820 నుంచి రూ.40,710కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గింది5. దీంతో ధర రూ.44,550 నుంచి రూ.44,410కు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్న రూ.210 పెరిగిన విషయం తెలిసిందే. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వెండి ధర కూడా పడిపోతూనే వస్తోంది. రూ.30 క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,600 నుంచి రూ.49,570కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,710కు పడిపోయింది. వెండి ధర రూ.49,570కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి రూ.100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగానే పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 3.37 శాతం తగ్గడంతో 1587.15 డాలర్లకు పతనమైంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు ఏకంగా 6.30 శాతం పతనమై 16.54 డాలర్లకు చేరింది.

Image result for gold rate

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation