శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర

23

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ? గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు భారీగా పడిపోయింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. భారీగా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర ఏకంగా రూ.850 తగ్గింది . దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.40,710 నుంచి రూ.39,860కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.750 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,410 నుంచి రూ.43,660కు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,070 తగ్గుదలతో కేజీ వెండి ధర రూ.49,570 నుంచి రూ.48,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగానే పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు ఏకంగా 3.37 శాతం తగ్గుదలతో 1587.15 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు ఏకంగా 6 శాతానికి పైగా తగ్గుదలతో 16.45 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,860కు చేరింది. వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర రూ.900 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40,700కు పడిపోయింది.

Image result for gold rate

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation