శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..

గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధర ఈరోజు కూడా భారీగా తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పడిపోయింది. దీంతో పసిడి ధర దిగొచ్చింది. అంతేకాకుండా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.290 తగ్గింది. దీంతో ధర రూ.38,980 నుంచి రూ.38,690కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 తగ్గింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 నుంచి రూ.42,240కు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో ధర రూ.49,300 నుంచి రూ.49,000కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం.

Image result for gold rate

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,690కు పడిపోయింది. వెండి ధర రూ.49,000కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గింది. దీంతో ధర రూ.40,700కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గడంతో రూ.39,500కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.300 తగ్గుదలతో రూ.49,000కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌ లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గింది. 1,575.75 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.55 శాతం తగ్గుదలతో 17.69 డాలర్లకు పడిపోయింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Image result for gold rate

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation