షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర

103

బంగారం కొనాలనుకునేవారికి షాక్. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.750 పెరుగుదలతో రూ.42,670కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.39,090కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.510 పెరగడంతో వెండి ధర రూ.40,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 1500 డాలర్ల దిగువున కదలాడుతోంది. పసిడి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 1472.90 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం వేరే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.21 శాతం పెరుగుదలతో 12.15 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,120కు చేరింది. వెండి ధర కూడా రూ.490 పెరుగుదలతో రూ.42,160కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఏకంగా రూ.750 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.39,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.750 పెరుగుదలతో రూ.41,100కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.510 పెరుగుదలతో రూ.40,500కు చేరింది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో మళ్లీ పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌ లో కూడా పెరిగింది. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

v

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation