షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం

27

పసిడి ప్రేమికులకు ఒక్క‌సారిగా బంగారం ధ‌ర షాక్ ఇచ్చింది… గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. ఒక్క‌సారిగా భారీగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.670 పెరుగుదలతో రూ.42,970కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.690 పెరుగుదలతో రూ.39,390కు చేరింది.

పసిడి ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం అక్కడే ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర స్థిరంగానే కొనసాగుతోంది. దీంతో వెండి ధర రూ.41,780 ద‌గ్గ‌రే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. కానీ 1500 డాలర్ల దిగువునే ఉంది. పసిడి ధర ఔన్స్‌కు 1.08 శాతం పెరుగుదలతో 1494.60 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.17 శాతం పెరుగుదలతో 12.14 డాలర్లకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఏకంగా రూ.700 ర్యాలీ చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరుగుదలతో రూ.40,250కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.700 పెరుగుదలతో రూ.41,450కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.41,780 ద‌గ్గ‌ర‌ స్థిరంగా ఉంది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation