బ్యాంకులు వరుసగా 7 రోజులు బంద్ తేదీలు ఇవే మీ ప‌నులు ముందే చేసుకోండి

బ్యాంకు ఖాతాదారుల‌కి వ‌చ్చేనెల‌లో ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి బ్యాంకులు ఇప్ప‌టికే వ‌ర్కింగ్ అవ‌ర్స్ విష‌యంలో ఇంకా కాస్త స‌మ‌యం పెర‌గాలి అని కోరుకుంటున్నారు క‌స్ట‌మ‌ర్లు. అయితే ఈ సెల‌వుల విష‌యంలో మాత్రం క‌స్ట‌మర్ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.బ్యాంకులు వచ్చే నెలలో ఏకంగా వరుసగా ఆరు రోజులు పని చేయకపోవచ్చు.బ్యాంక్ యూనియన్ల సమ్మె బాట పట్టనుండటం, ప్రభుత్వ సెలవులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి.దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది… క‌చ్చితంగా ఈ సెల‌వులు దృష్టిలో ఉంచుకోండి… బ్యాంక్ ఖాతాదారులు అలర్ట్‌గా ఉండాలి. ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే సెలవులకు అనుగుణంగా వాటిని ముందుకు లేదంటే వెనక్కి జరుపుకోవడం మంచిది.

Image result for banks closed

బ్యాంక్ యూనియన్లు మళ్లీ సమ్మె బాట పడుతున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 సమ్మె తర్వాత మరోసారి స్ట్రైక్ చేయస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈసారి మూడు రోజులపాటు సమ్మె ఉంటుందని వార్న్ చేస్తున్నారు. బ్యాంక్ యూనియన్లు ఈసారి మళ్లీ సమ్మె సైరన్ మోగిస్తే.. బ్యాంక్ కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చు. వారం రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదముంది. బ్యాంక్ యూనియన్లు వచ్చే నెల రెండో వారంలో అంటే మార్చి 11 నుంచి 13 వరకు స్ట్రైక్ చేస్తామని హెచ్చరించాయి.బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పడితే.. బ్యాంకింగ్ కార్యకలాపాలపై వరుసగా ఐదు రోజులు ఎఫెక్ట్ పడనుంది. మార్చి 11 బుధవారం అవుతుంది. అంటే బుధ, గురు, శుక్ర వారాల్లో స్ట్రైక్ ఉంటుంది. ఇక శనివారం, ఆదివారం ఎలాగో బ్యాంకులు ఉండవు. అంటే బ్యాంకులు వరుసగా ఐదు రోజులు పనిచేయవు.

Image result for banks closed

మార్చి 10న హోలీ ఉంది. అంటే ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే ఇప్పుడు మార్చి 10 నుంచి మార్చి 15 వరకు బ్యాంకులు పనిచేయకపోవచ్చు. అంటే ఆరు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. ఇక్కడ మార్చి 9 సోమవారం. ఈ ఒక్క రోజు మినహాయిస్తే మార్చి 8 నుంచి మార్చి 15 వరకు బ్యాంక్‌లు పనిచేయకపోవచ్చు. అంటే మార్చి 9 మినహాయిస్తే బ్యాంకులు వరుసగా ఏడు రోజులు పనిచేయవు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి.ఇటీవ‌ల జ‌రిపిన వేతన సవరణ చర్చలు విఫలం కావడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. బ్యాంక్ యూనియన్లు ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు స్ట్రైక్ చేశాయి. జనవరి 8న బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తర్వాత జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో కూడా బ్యాంక్ యూనియన్లు సమ్మె చేశాయి.

ఈ క్రింది వీడియో చుడండి

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉంటుంది. 2012లో వేతన సవరణ జరిగింది. తర్వాత 2017లో వేతన సవరణ జరగాల్సి ఉంది. అయితే అది జరగలేదు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవి విజయవంతం కావడం లేదు. బ్యాంక్ యూనియన్లు పే స్లిప్ కాంపొనెంట్స్‌లో 20 శాతం పెంపు కోరుతున్నాయి. కానీ దీనికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడం లేదు. 12.5 శాతం పెంపు ఇస్తామని అంటున్నారు, మ‌రి వ్యాపారుల‌కి మాత్రం ఈ వారం రోజులు బ్యాంకులు క్లోజ్ అయితే చాలా ఇబ్బంది.. చూశారుగా ఈ డేట్స్ గుర్తు ఉంచుకోండి ,దాని ప్ర‌కారం బ్యాంకు ప‌నులు ముందుగానే పూర్తి చేసుకోండి.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation