breakingnews : భారీగా తగ్గిన బంగారం ధర… పెరిగిన వెండి!

బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో మన మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడింది. కరోనా వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడొచ్చనే అంచనాల నడుమ ఆ దేశ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు కేవలం రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,990 నుంచి రూ.38,940కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉంది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 వద్దనే కొనసాగుతోంది. బంగారం ధర దాదాపు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.

Image result for gold rate

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,980కు పడిపోయింది. వెండి ధర రూ.49,300కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.290 పెరిగింది. దీంతో ధర రూ.41,000కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 పెరుగుదలతో రూ.39,800కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు చేరింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రింద వీడియో చూడండి:

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Content above bottom navigation