breakingnews : భారీగా పెరిగిన బంగారం ధర

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఈరోజు పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. అలాగే దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకుంది. దీంతో బంగారం ధర పైకి కదిలింది. రూపాయి కూడా బలహీనపడటం బంగారం పెరగడానికి కారణం అయ్యింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.520 పెరిగింది. దీంతో ధర రూ.39,130 నుంచి రూ.39,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.520 పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,640 నుంచి రూ.43,160కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.520 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.39,650కు చేరింది. వెండి ధర రూ.49,900కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 పెరుగుదలతో రూ.41,550కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరుగుదలతో రూ.40,350కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.49,900కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. ఏడేళ్ల గరిష్ట స్థాయికి తాకింది. 1600 డాలర్ల పైకి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1,606.85 డాలర్లకు పెరిగింది. బంగారం ధర మాదిరిగానే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 18.22 డాలర్లకు చేరింది.

Image result for gold rate

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే, ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation