breakingnews : భారీగా పెరిగిన బంగారం ధర

గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఈరోజు మళ్ళి పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. అలాగే దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకుంది. దీంతో బంగారం ధర పైకి కదిలింది. రూపాయి కూడా బలహీనపడటం బంగారం పెరగడానికి కారణం అయ్యింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.38,640 నుంచి రూ.38,880కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.240 పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.42,150 నుంచి రూ.42,390కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 పైగా పెరిగింది. దీంతో ధర రూ.48,800 నుంచి రూ.49,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.

Image result for gold rate

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,880కు చేరింది. వెండి ధర రూ.49,000కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.40,900కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.39,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 పెరుగుదలతో రూ.49,000కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.34 శాతం పైకి కదిలింది. 1,577.25 డాలర్లకు పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.06 శాతం పెరుగుదలతో 17.69 డాలర్లకు చేరింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Image result for gold rate

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే, ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation