breakingnews : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

67

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు దిమ్మతిరిగే న్యూస్. బంగారం ధర ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,020 పెరగడంతో రూ.46,160కు చేరింది.. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరగడంతో రూ.42,310కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.. కేజీ వెండి ధర రూ.1230 మేర పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,080కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం పెరిగింది. 1,675 డాలర్ల సమీపంలోకి చేరింది. బంగారం ధర ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 1674.35 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.30 శాతం తగ్గుదలతో 17.34 డాలర్లకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1090 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,530కు చేరింది. వెండి ధర కూడా రూ.1030 పెరుగుదలతో రూ.50,030కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.950 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.43,200 కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.44,400కు చేరింది. ఇక వెండి ధర కూడా రూ.1230 పెరుగుదలతో రూ.51,080కు పరుగులు పెట్టింది.

Image result for gold rate

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో మళ్లీ పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌ లో కూడా పెరిగింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation