breakingnews : వరుసగా నాల్గవ రోజు భారీగా బంగారం..

గత నాలుగు రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధర మళ్ళి పెరిగింది.. హైదరాబాద్ మార్కెట్‌ లో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.990 పెరుగదలతో రూ.43,430 నుంచి రూ.44,420కు చేరింది. బంగారం ధర రూ.45 వేల మార్క్‌కు ఇంకొంచెం దూరంలోనే ఉంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.910 పెరిగింది. దీంతో ధర రూ.39,810 నుంచి రూ.40,720కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.1100 పెరగడంతో రూ.49,900 నుంచి రూ.51,000కు చేరింది.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర 7 ఏళ్ల గరిష్ట చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 1.57 శాతం పెరుగుదలతో 1645.95 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.75 శాతం పెరుగుదలతో 18.45 డాలర్లకు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.910 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,720కు చేరింది. వెండి ధర రూ.51 వేలకు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌ లో పసిడి ధర రూ.940 పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,600కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. 1650 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. పసిడి ధర ఔన్స్‌కు 1.57 శాతం పెరుగుదలతో 1,645.95 డాలర్లకు పెరిగింది. బంగారం ధర పరుగులు పెడుతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.75 శాతం పెరుగుదలతో 18.45 డాలర్లకు చేరింది.

Image result for gold rate

బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సహా పలు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు పసిడి పరుగుకు దోహదపడతాయని తెలిపారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీన పడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని పేర్కొన్నారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000 మార్క్‌కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation