శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌ లో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గుదలతో రూ.45,890కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గడంతో రూ.42,070కు తగ్గింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర రూ.50 వేల మార్క్ కిందకు వచ్చేసింది. కేజీ వెండి ధర రూ.1,130 మేర తగ్గడంతో కేజీ వెండి ధర రూ.49,950కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం 1,700 డాలర్లకు పైగా పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.70 శాతం పెరుగుదలతో 1702.50 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. వెండి ధర ఔన్స్‌కు 0.63 శాతం పెరుగుదలతో 17.37 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.41,360కు పడిపోయింది. వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.250 మేర తగ్గడంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,950కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గడంతో రూ.44,150కు చేరింది. ఇక వెండి ధర కూడా రూ.1130 తగ్గుదలతో రూ.49,950కు చేరింది.

Image result for శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.

బంగారం ధర పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation