ప్రపంచ కుబేరుడు కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా అందులో ప్ర‌త్యేక‌త‌లు ఇవే

108

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తే అందులో వినిపించే పేరు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్ ది, ఆయ‌న ఈసారి కూడా అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడంతో అంద‌రూ షాక్ అయ్యారు, మ‌రి ప్ర‌పంచ ధ‌నవంతుడు ఎంత లగ్జ‌రీగా ఉంటాడు అంటే మ‌న ఊహ‌కి కూడా అంద‌దు, అంత డ‌బ్బు పేరు ప్ర‌ఖ్యాత‌లు ల‌క్ష‌ల కోట్ల ఆస్తి ఆయ‌న సొంతం కావ‌డంతో ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా క్ష‌ణాల్లో వెళ‌తారు.. ఏది కావాల‌న్నా త‌మ కాళ్లముందు తెప్పించుకుంటారు, ఏనాటి నుంచో అమెరికా సంప‌న్నులే ప్ర‌పంచ మేటి ధ‌న‌వంతులుగా కీర్తింప‌బ‌డుతున్నారు.

Image result for జెఫ్ బెజోస్

తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా చెప్పే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. నిత్యం ఏదో ఒక విషయం మీద ఆయన వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. వ్యాపారంలోనే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో హెడ్ లైన్స్ లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో? దీర్ఘకాలం వైవాహిక బంధంలో ఉండి.. ఈ మధ్యనే విడాకులు తీసుకొని గర్ల్ ఫ్రెండ్ లౌరెన్ సాంచెజ్ తో విలాసంగా గడుపుతున్నారు ఆయన.. ఇటీవల కాలంలో భారీగా షాపింగ్ చేస్తున్నాడు.

Jeff Bezos bought the most expensive property in LA

ఒక పాతకాలం నాటి విలాసవంతమైన భవనాన్ని తాజాగా బెజోస్ కొనుగోలు చేసినట్లుగా ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌ తాజాగా పేర్కొంది. ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం సదరు ఇంటి విలువ ఏకంగా రూ1150 కోట్లు కావటం విశేషం. లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్ లో ఈ విలాసవంతమైన భవనం ఉంది. ఇంత భారీ ధర పలకటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.

1930లలో హాలీవుడ్ చిత్రం టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ భవనాన్ని 1992లో ఆర్కిటిపాల్ స్టూడియో మొఘల్ ఎస్టేట్ గా అభివర్ణిస్తారు. ఈ భవనంలో జార్జియన్ స్టైల్లో విస్తారమైన టెర్రెస్ లతో పాటు భారీ గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి. 1990 నుంచి ఈ విలాసవంతమైన భవనం డేవిడ్ జెఫెన్ అధీనంలో ఉండగా.. తాజాగా అమెజాన్ అధిపతి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో తన గర్ల్ ఫ్రెండ్ లో కలిసి విపరీతమైన షాపింగ్ చేస్తున్న బెజెస్ కు ఇప్పటికే పలు ఇళ్లు ఉన్నాయి.గర్ల్ ఫ్రెండ్ లౌరెన్ సాంచెజ్ ఓ భ‌వ‌నం అడిగార‌ట అది కూడా ప్ర‌త్యేకంగా ఉండాలి అని కోరారు అందుకే అత్యంత ఖ‌రీదైన భ‌వనం కొనుగోలు చేసి ఆమెకు ఇష్ట‌మైన రీతిలో ఇంటిరీయ‌ర్ మార్పులు చేయ‌నున్నార‌ట‌. ఆయ‌న‌కు దాదాపు ఇలాంటి ఎస్టేట్స్ 20 వ‌ర‌కూ ఉన్నాయి అనేది తెలిసిందే.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation