గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

114

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నిన్న మళ్ళీ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మళ్ళీ తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌ లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,050 తగ్గుదలతో రూ.41,920కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 తగ్గుదలతో రూ.38,340కు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,790 తగ్గడంతో వెండి ధర రూ.39,990కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Image result for gold
అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 1472.90 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 3.21 శాతం పెరుగుదలతో 12.15 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,050 తగ్గడంతో రూ.42,250కు పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1090 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,260కు పడిపోయింది. వెండి ధర కూడా రూ.400 తగ్గుదలతో రూ.48,550కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఏకంగా రూ.1,100 పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 తగ్గుదలతో రూ.39,150కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1100 తగ్గడంతో రూ.40,350కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.39,990కు చేరింది.బంగారం ధర పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

Image result for గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation