Tuesday, July 27, 2021

‘బాలికా వధూ 2’ సీరియల్ … మరో ‘ఆనంది’ పాత్రలో చిన్నారి పెళ్లికూతురు

Must Read

‘బాలికా వధూ 2’ ప్రోమో విడుదలైంది. సరికొత్త ఆనంది ఎవరో ప్రేక్షకులకి తెలిసిపోయింది. గతంలో డైలీ సీరియల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ‘బాలికా వధూ’కి ఇది సీక్వెల్ అనుకోవచ్చు. ఆ సీరియల్ లో ఆనంది పాత్ర అందరిని ఆకట్టుకుంది. అయితే, కంప్లీట్ గా కొత్త స్టోరీ అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు బాలికా వధూగా అవికా గోర్ నటించింది. ఈసారి ఆనంది పాత్రలో కనిపించిన చిన్నారి మరింత తక్కువ వయస్సు అమ్మాయి కావటం విశేషం. ప్రోమోలో ఆమెని కొత్త పెళ్లికూతురుగా చూపించారు. ఇంట్లో కాలుమోపిన బాలికా వధూ తరువాతి సన్నివేశంలో ఎడారిలో నడుస్తూ కనిపిస్తుంది.

ప్రోమో ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. ‘బాలికా వధూ’ లాంటి డైలీ సోప్స్ చూసేవారికి ‘బాలికా వధూ 2’ కూడా ఆసక్తి కలిగించే అవకాశం ఉంది. బాల్య వివాహాలు ఇంకా మన సమాజంలో ఉన్నాయి. వాటిని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

‘బాలికా వధూ’ సీజన్ వన్ అప్పట్లో తెలుగులోనూ అలరించింది. ‘చిన్నారి పెళ్లికూతురు’గా ఇక్కడ ప్రసారం అయింది. ‘బాలికా వధూ 2’ కూడా వివిధ భాషల్లోకి అనువాదం అయ్యే అవకాశాలున్నాయి. అయితే, ముందుగా హిందీ వర్షన్ కి జాతీయ స్థాయిలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి…

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This