Friday, July 30, 2021

ఇందిరా గాంధీగా బయోపిక్ లో కాంట్రవర్సీ క్వీన్ కంగనా?

Must Read

తమిళ్ లెజెండరీ పొలిటీషియన్‌ జయలలిత బయోపిక్‌లో రీసెంట్‌గా నటించిన కంగనా… తాజాగా మరో లెజెండరీ పొలిటికల్ పర్సన్‌ జీవితాన్ని రిప్రజెంట్ చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ఇందిరా గాంధీగా నటించబోతున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించారు. ఇటీవల ఈ సినిమా తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇది విడుదల కాకముందే మరో చిత్రాన్ని ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. భార‌త‌దేశ దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో తాను న‌టించ‌బోతున్న‌ట్లు కంగ‌నా అధికారికంగా తెలిపారు.

ఎప్పుడూ వివిదాలతో సహవాసం చేస్తూ… క్వీన్‌ ఆఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న కంగనారనౌత్‌.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేశారు. ఓ లెజెండరీ పొలిటికల్ పర్సన్‌గా మన ముందుకు రాబోతున్నారు. అయితే ఇది బయోపిక్ కాదట. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు అప్పటి, ఇప్పటి రాజకీయ పరిస్థితులకు తార్కానంగా ఈ సినిమా ఉండబోనుందట. వివాదాలకు పర్యాయపదంలా ఉండే కంగనా.. ఇలాంటి ఓ సెన్సిటివ్‌ కథలో నటిస్తుండడంతో.. ఈ సినిమా పైనే అందరిచూపు ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతోందో..!. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తుండగా, సాయి క‌బీర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This