Friday, July 30, 2021

వైజాగ్ లో పర్యాటక రంగంపై కరోనా పడగ

Must Read

వైజాగ్ అంటేనే పర్యాటక రంగానికి పేరు. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి….పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖపట్నంలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో వారంతా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కొంతమంది వాళ్ళ వ్యాపారాలను పూర్తిగా మూసుకున్నారు కూడా.

విశాఖకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. రాష్ట్రానికి వచ్చే వారిలో ఎక్కువమంది ఏజెన్సీ ప్రాంతాలను, జలపాతాలు, కొండ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పొరుగు దేశాల నుంచి వందల మంది నగరంలోని టూరిజం స్పాట్స్ సందర్శనకు వస్తారు. కరోనా పుణ్యమా అని… రెండేళ్లుగా ఎవరూ రావడంలేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బుకింగ్ లతో బిజీబిజీగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వాహన రంగానికి అనుబంధంగా ఉపాధి పొందే వాళ్ళు కూడా నష్టపోయారు.

సాధారణ రోజుల్లో నగరంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులన్నీసందడిగా ఉండేవి. వాహనాల గిరాకీతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలు నిర్వహించేవారు. కరోనా వల్ల జనం ఎంతో అత్యవసరమైతే తప్ప ఎక్కడా బయటకు వెళ్లడం లేదు. దూర ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పర్యాటక వ్యాపారాల మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక సంస్థల నిర్వహణ, ఉపాధికల్పన భారంగా మారుతోంది. ఈ సమయంలో పన్ను విరమణ, ఇతర మినహాయింపులిచ్చి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This