Tuesday, July 27, 2021

దిశా పటాని “కిస్ మీ మోర్” అంటూ స్టెప్స్…ఫ్యాన్స్ ఫిదా

Must Read

ప్రస్తుతం హీరోయిన్ దిశా జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దిశా తన హాట్ పిక్స్ షేర్ చేసి ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఇటీవలే ఆమె బికినీ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేసి హాట్ టాపిక్ కు తెర తీశాయి.

తాజాగా ఈ హాట్ బ్యూటీ డోజా క్యాట్ “కిస్ మీ మోర్” సాంగ్ కు అట్రాక్టివ్ స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కిల్లర్ మూమెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నటి గతంలో మేరే నసీబ్ మెయిన్, వాప్, ట్యాప్ ఇన్ లతో పాటు మరిన్ని పాటలపై డాన్స్ కవర్ వీడియోలను షేర్ చేసుకుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This