Friday, July 30, 2021

సినీ అభిమానులకు శుభవార్త… తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ తెరుచుకుంటున్నాయి

Must Read

కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిమితులను పూర్తిగా ఎత్తేశాయి ప్రభుత్వాలు. కరోనా కారణంగా విడుదలకు వాయిదా వేసుకున్న ఎన్నో చిత్రాల నిర్మాతలు థియేటర్ల తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే విడుదల అవ్వడానికి పలు భారీ సినిమాలు ఇంకా ముందున్నాయి.

తాజా సమాచారం ప్రకారం జూలై 8 నుంచి థియేటర్లను ఓపెన్ చేయడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోనుండగా, తెలంగాణలో మాత్రం థియేటర్లను 100% ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలువురు నటులు సినిమా షూటింగులకు మొదలుపెట్టేశారు. అయితే ఈ మహమ్మారి కారణంగా ఎంతమంది థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారనేది మనం మున్ముందు చూడాలి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This