Tuesday, July 27, 2021

హీరోయిన్ నోరా ఫతేహి హాట్ డ్యాన్స్… వీడియో వైరల్

Must Read

గత కొన్ని రోజులను నుంచి డ్రేక్ సాంగ్ ‘వన్ డాన్స్’కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. తాజాగా అదే సాంగ్ కు నోరా చేసిన డ్యాన్స్ నెట్టింట్లో హీట్ పుట్టిస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఒక అద్భుతమైన డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఆమె మెలికలు చూస్తే మతి పోతుంది. తాజాగా మరో హాట్ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ బ్యూటీ.

ఈ వీడియోలో ఆమె పింక్ బికినీ, బ్లూ షార్ట్, స్నీకర్స్ ధరించి కష్టమైన స్టెప్పులను అలవోకగా చేసేస్తోంది. “సమ్మర్ టైమ్ వైబ్స్ …” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది నోరా. కాగా నోరా ఫతేహి చేసిన “సత్యమేవ జయతే” చిత్రంలోని “దిల్బార్” సాంగ్, ‘బాట్ల హౌస్’ సినిమాలోని ‘ఓ సాకి సాకి’, ‘స్ట్రీట్ డాన్సర్ 3డి’లోని ‘గర్మి’ సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె సోషల్ మీడియాలో 29 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో భారీ క్రేజ్ ను కొనసాగిస్తోంది. అభిషేక్ దుధయ్య ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో నోరా కనిపించనుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This