Friday, July 30, 2021

విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..

Must Read

బాలీవుడ్ లో మంచి విజయాన్ని దక్కించుకున్న క్వీన్ సినిమాకు రీమేక్ గా పారిస్ పారిస్ అనే తమిళ్ సినిమాలో నటిచింది కాజల్. ఈ సినిమాను సౌత్ లోని నాలుగు భాషల్లో కూడా ఒకేసారి రీమేక్ ను వేరు వేరు హీరోయిన్స్ తో మొదలు పెట్టారు. తెలుగులో తమన్నా నటిస్తుంది. అయితే రకరకాల కారణాల వల్ల నాలుగు సినిమాలు రిలీజ్ కాలేదు. సినిమాలో కొన్ని బూతు సన్నివేశాలు ఉండటంతో పాటు.. అసభ్యకరంగా డైలాగ్స్ ఉన్నాయట దాంతో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.

కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీఇచ్చిన కాజల్ ఆతర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో కాజల్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆతర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీల వైపు అంతా చూస్తున్నారు. సెన్సార్ సమస్య ఉన్న ఈ సినిమా ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారంట మేకర్స్ .అతి త్వరలోనే ఓటీటీతో చర్చలు ముగించి విడుదల తేదీని ప్రకటించేందుకు గాను తమిళ క్వీన్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This