Saturday, June 19, 2021

కరోనా సోకితే ఎన్ని రోజులు శృంగారం చెయ్యకూడదో తెలుసా?

Must Read

కరోనా తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలామందిలో అనేక సందేహాలున్నాయి. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శృంగార జీవితం ఎప్పటి నుంచి కొనసాగించవచ్చు? ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవచ్చా..? లేదా వ్యాక్సిన్‌ తీసుకున్నాక మంచిదా? శృంగారం ద్వారా భాగస్వామికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు. ఎవరిని అడగాలో తెలియదు. ఇంట్లో పెద్దల్ని అడగలేరు. వైద్యుణ్ని అడుగుదామా.. అంటే.. బిడియం. అందుకే.. అలాంటి ఎన్నో జంటలను వేధిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గురించి తెలుసుకుందాం..

కరోనా తగ్గిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా? ఎంతకాలం దూరంగా ఉండాలి?
భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా, తగ్గిన తర్వాత నెల పాటు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. కనీసం మూడు వారాలైనా నిగ్రహం పాటించాలి. దంపతులిద్దరికీ కరోనా వస్తే నెల కంటే ఎక్కువ కాలం దూరంగా ఉండాలి. లేదంటే ఒకరి ప్రభావం మరొకరిపై పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యపై జన్యుపరంగా ఎలాంటి పరిశోధనలు జరగలేదు. కానీ పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొంతమందికి లక్షణాలు ఉంటున్నాయి. దీనికితోడు శరీరం నీరసించి ఉంటుంది. శృంగారం అనేది ఒత్తిడితో కూడుకున్నది. కరోనా వచ్చిన పురుషుల వీర్యంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొన్నా ఇబ్బందేమీ ఉండదు. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటే అవి తగ్గేంత వరకు దూరంగా ఉండటం మంచిది.

వీర్య కణాలలో కొవిడ్‌ వైరస్‌ ఉంటుందా.. ఉండదా.. అనే దానిపై స్పష్టత లేదు. వీర్య కణాల్లో వైరస్‌ను గుర్తించామని కొన్ని, లేదని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పటికి గానీ దీనిపై స్పష్టత రాదు. అయితే.. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శృంగారంలో పాల్గొంటే మాత్రం వైరస్‌ సోకుతుంది.

కరోనా వచ్చినవారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవచ్చా?
భార్యాభర్తల్లో ఎవరికైనా కరోనా వస్తే కనీసం నెల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని చెప్తున్నాం. తొందరపడి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవద్దు. కనీసం మూడు నెలలపాటు వేచి ఉండటం మంచిది. అనుకోకుండా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే ఏమీ చేయలేం. కరోనా వల్ల అబార్షన్‌ అవుతుందని భావించలేం. అబార్షన్‌ చేసుకోవాల్సిన అవసరమూ లేదు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This