Saturday, June 19, 2021

పిల్లలు పుట్టాక శృంగారం ఎలా చెయ్యాలో తెలుసా?

Must Read

భార్యభర్తల మధ్య పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది. ఇంతకు మునుపులా ఎప్పుడంటే అప్పుడు ఒకరికోసం ఒకరు టైం కేటాయించుకోలేరు. మనసులో కోరికలు చెలరేగుతున్నా.. తనువుల దాహం తీర్చలేరు. దీంతో ఆ గ్యాప్ కాస్త పక్కదారి పట్టే ప్రమాదాలూ ఉంటాయి.వివాహేతర సంబంధాల్లో ఎక్కువగా భార్య గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ అయిన సమయాల్లోనే భర్తలు అడ్డదారి తోక్కుతారని చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్ ను దూరం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు, మీ భర్త డేట్ నైట్స్ కు వెళ్లేలా టైం సెట్ చేసుకోండి. కనీసం ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ మూవీ చూడండి. పాప పడుకున్నప్పుడో.. లేదా నాన్నమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో ఉన్నప్పుడో వేరే విషయాలకు కాకుండా ఇద్దరూ ఒకరితో ఒకరు గడపడానికి టైం కేటాయించుకోండి. ఇద్దరి మధ్య రోజూ తలెత్తుతున్న వాదనలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివాటిగురించి చర్చించుకోవడానికి వారంలో ఓ రోజును కేటాయించుకోండి. అన్నీ ఆ రోజే తేల్చేసుకోండి.. దీనివల్ల రోజూ గొడవలు తగ్గుతాయి.

పిల్లలు పుట్టిన తరువాత భార్యభర్త ల మధ్య ఎక్కువగా వచ్చే గొడవలు పిల్లల డైపర్స్ మార్చడం, వారికి పాలు పట్టడం, వారి ఆలనా, పాలనా విషయాల్లోనే అయి ఉంటుంది. ఎవరెంత ఎక్కువ చూసుకున్నారు అని లెక్కలు వేసుకునేకంటే.. ఇద్దరూ కలిసి అది తమ బాధ్యతగా తీసుకుని, ఒకరికొకరు సాయం చేసుకునేలా మాట్లాడుకుంటే గొడవలే ఉండవు.

మీరు ప్రేమలో పడ్డ మొదటి రోజుల్లో లేదా పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవారు.. ఎలాంటి చిలిపి పనులు చేసేవారు లాంటి విషయాలు గుర్తు చేసుకోండి. జ్ఞాపకాలు మిమ్మల్ని బాగా రిఫ్రెష్ చేసి మళ్లీ ప్రేమలో పడేలా చేస్తాయి. ఇక చివరగా దంపతుల మధ్య అతి ముఖ్యమైన అంశం శృంగారం కోసం ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ శృంగారజీవితం మళ్లీ పట్టాలెక్కుతుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This