Saturday, June 19, 2021

శృంగారం తర్వాత ఆడవారి శరీరంలో వీర్యం ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా?

Must Read

శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీనిని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. శృంగారం గురించి అవగాహన లేక.. చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. కనీసం గర్భం ఎలా వస్తుందనే అవగాహన కూడా ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియదని డాక్టర్లు చెప్తున్నారు.

చాలా మంది.. శృంగారం చేసిన తర్వాత యోనిని శుభ్రం చేసుకోవడం వల్ల.. లేదా మూత్ర విసర్జన చేయడం వల్ల తమకు ప్రెగ్నెన్సీ రాదనే భ్రమలో ఉంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. యోనిని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా.. యోని లోపల వీర్యం ఉండిపోతుందట. స్త్రీ అండం ఫలదీకరణం చెందడానికి పురుషుడి వీర్యాలు కనీసం లక్షల్లో ఉండాలట. ఒక టీ స్పూన్ వీర్యంలో 100- 600 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయని మీకు తెలుసా..

కలయిక తర్వాత.. చాలా వీర్యం బయటకు వచ్చేస్తుంది. కానీ.. శరీరం లోపలకి వీర్యం వెళుతోంది. అలా వెళ్లిన వీర్యం కొన్ని రోజులపాటు శరీరంలోనే ఉండిపోతుంది. చాలా మంది కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే వీర్యం శరీరంలో ఉంటుందని పొరపడతారు. అయితే… అలా కాకుండా.. దాదాపు మూడు నుంచి ఐదు రోజులపాటు.. నిల్వ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇక ఆస్పత్రిలో చాలా మంది వీర్యం స్టోర్ చేసుకొని.. ఆ తర్వాత పిల్లలను కంటూ ఉంటారు. అయితే.. అక్కడ వీర్యాన్ని ఫ్రోజెన్ చేస్తారు. అలా ఫ్రోజెన్ చేయడం వల్ల కొన్ని సంవత్సరాలపాటు అది పాడవకుండా అలాంటే ఉంటుందంట.. ఇది నిజంగా అధ్బుతమే కదా..!

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This