Thursday, June 24, 2021

మీ ఆవిడ మిమ్మల్ని దూరం పెడుతోందా.. ప్రతి భర్త తెల్సుకోవాల్సిన విషయాలు

Must Read

భార్యభర్తల కాపురం సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా ముఖ్యం. ఇది వారి సంసార జీవితాన్ని మరియు శృంగార జీవితాన్ని మరింత సంతోషంగా ఉంచుతుంది. అయితే అలా రోజులు గడిచే కొద్ది కొన్నిసార్లు ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో భార్యలు.. భర్తతో సన్నిహితంగా గడపడానికి కూడా ఆసక్తి చూపించరు. చిలిపి రొమాన్స్, శృంగారం.. చిన్న చిన్న అల్లర్లు ఇవి వారికి బోర్ గా, చిరాకుగా ఉంటాయి. దీంతో భర్తను దూరం పెడుతూఉంటారు. దీన్ని అలాగే వదిలేయకుండా కారణం తెలుసుకుంటే మీరు మళ్లీ మునుపటిలా.. చిలకాగోరింకల్లా.. హాయిగా శృంగార సుఖం అనుభవించొచ్చు.

ఆడవాళ్ళ దృష్టిలో శృంగారం అనేది రొటీన్ కాదు. అది మానసికపరమైనది.. మీ మీద ఇష్టం లేకున్నా, వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉన్నా అది డైరెక్ట్ గా మీ శృంగార జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ముందుగా ఆమెతో మాట్లాడండి.. ఆమెను మాటలతో మచ్చిక చేసుకోండి.. ఎందుకలా ఉంద. అసలు సమస్య ఏంటో కనుక్కోండి. శృంగారం విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఇద్దరూ కలిసి పరిష్కరించుకోండి. మీరు మీ భార్య నమ్మకాన్ని వమ్ము చేసినట్లైతే ఆమె మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. ఇతర సంబంధాలు మీ అసలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే గతంలో చేసిన తప్పుల్ని గుర్తించండి.. అలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడండి.

శృంగారంలో బాధ : వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లో హార్మోన్లలో మార్పులు సహజమే. ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్, మెనోపాజ్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ శృంగారాన్ని బాధాకరం చేస్తాయి. అలాంటి సమయంలో ఆమె రిలాక్స్ గా ఉండే సమయంలో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించండి. పెళ్లైనకొత్తలో ఉన్నట్టుగా రోజులు గడుస్తుంటే.. ఉండదు. ఇంటి బాధ్యతలు, ఆఫీసు పని ఒత్తిడులు ఎక్కువవుతుంటాయి. అలాంటి సమయాల్లో శృంగారం మీద ఆసక్తి తగ్గడం మామూలే. ఇంటి పనిలో తనకు సాయం చేయడం వల్ల మళ్లీ తనను మీ దారిలోకి తెచ్చుకోవచ్చు.

శృంగారం అంటే రెండు శరీరాల కలయిక. ఇది ఒకేసారి బెడ్రూంలోకి వెళ్లగానే చేసే పని కాదు. రోజులో అప్పుడప్పుడు ఒకరిని ఒకరు తాకుతుండాలి. అంటే ముద్దు పెట్టడమో, హగ్ ఇవ్వడమో..ఇలా రోజువారీ కార్యక్రమంలో ప్రేమతో కూడిన స్పర్శ దూరమవ్వడం వల్ల కూడా తాను మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. శృంగారం మరీ రొటీన్ గా మారి బోర్ కొట్టడం వల్ల కూడా ఆమె మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేయండి. శృంగారంలో పొజిషన్స్ మార్చడం.. లేదా ఏదైనా హోటల్ లో గడపడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇలా.. అంతేకాదు దీంతోపాటు తనతో శృంగారం ఒక్కటే కాదు.. చిలిపి మాటలు కూడా ఆమెకు ఎంతో తెలియని సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయని తెలుసుకొండి.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This