Home Entertainment Lifestyle శృంగారం తర్వాత ప్రతి మగాడు ఖచ్చితంగా చెయ్యాల్సిన 3 పనులు

శృంగారం తర్వాత ప్రతి మగాడు ఖచ్చితంగా చెయ్యాల్సిన 3 పనులు

0

వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో శృంగారం చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు శృంగారం చెయ్యడానికి బాగా ఇష్టపడతారు. శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. ఈ సృష్టి మూలం.. మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన కచ్చితంగా అవసరమే. అయితే చాలా మందికి శృంగారం ఎలా చేయాలో తెలుసు కానీ శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో చాలామందిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. అయితే శృంగారం తర్వాత చేయాల్సిన పనులు, చేయకూడనివి ఏమిటో తెలుసుకోవాలి.

పడక గదిలో మగవాడు సెక్స్ చేసిన తర్వాత తన పని అయిపోయింది అనుకొని పడుకుంటాడు. అయితే స్త్రీ మాత్రం పూర్తిగా సంతృప్తి చెందింది అనుకోవడం పొరపాటే..ఇలాంటి సందర్భాల్లో స్త్రీ మరింత సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. కామసూత్ర ప్రకారం పడక గదిలో విజృంభించిన తర్వాత స్త్రీ మరింత సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. స్త్రీ ఒంటికి గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా రాస్తూ ఆమెను బిగి కౌగిలిలో ముంచెయ్యాలి.

శృంగారం చేసిన తర్వాత ఇద్దరూ కలిసి జలకాలు ఆడటం, లేదా స్నానం చేయాలని, ఆ తర్వాత ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలని సూచించారు. ముఖ్యంగా పండు వెన్నెలలో స్త్రీని ఒడిలో తీసుకొని పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది.

Exit mobile version