Friday, July 30, 2021

పాకిస్తాన్ లో బ‌ర్త్‌డే పార్టీకి ఆ సింహ‌మే చీఫ్ గెస్ట్‌…నెటిజ‌న్లు ఆగ్ర‌హం

Must Read

పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఒక్కొక్క‌రు ఒక్కోవిధంగా జ‌రుపుకుంటారు. అయితే పాకిస్తాన్ లో ఒక ఆమె జరుపుకున్న పుట్టినరోజు వేడుకులు వివాదాస్పద వాక్యాలకు తెరతీసాయి. కొంత‌మంది జ‌రుపుకునే పుట్టిన‌రోజు వేడుక‌లు వింతగా ఉంటాయి మరి. నెటిజ‌న్ల చేత చివాట్లు పెట్టిస్తుంటాయి. పాకిస్తాన్ కు చెందిన సునాన్ ఖాన్ అనే మ‌హిళ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను లాహోర్‌లోని ఓ హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రుపుకున్న‌ది. ఈ వేడుక‌ల‌కు చీఫ్ గెస్ట్ గా ఆమె సింహాన్ని తీసుకొని వ‌చ్చింది. ఆ సింహాన్ని గొలుసుతో క‌ట్టేసి, కుర్చీపై కూర్చోపెట్టారు. దాని చుట్టు చేరి డ్యాన్స్ చేస్తూ వీడియో దిగారు.

ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా యానిమల్ కేర్ టేక‌ర్ సంస్థ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. సునాన్ ఖాన్ పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఇక నెటిజ‌న్లు సునాన్ ఖాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెకు కూడా మ‌త్తు ఇచ్చి, గొలుసుతో క‌ట్టేసి అలా కూర్చోబెడితే ఆ బాధ తెలుస్తుంద‌ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This