Friday, July 30, 2021

షూటింగ్ మొదలుపెట్టిన “పుష్ప” టీం

Must Read

అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

నేడు సికింద్రాబాద్ లోని సెట్ లో పుష్ప” టీం తిరిగి చిత్రీకరణను ప్రారంభించారు. అక్కడ 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇందులోనే ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. 45 రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తద్వారా రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలన్నది వారి భావన. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This