Friday, July 30, 2021

నెట్ ఫ్లిక్స్ నుంచి కొన్ని సినిమాలు తొలిగింపు…ఇక ‘ఆ సినిమాలు, సిరీస్ లు’ అందుబాటులో ఉండవు

Must Read

సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటి గురించే చెప్పుకుంటాం. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొంత కంటెంట్ కూడా కనుమరుగైపోతుంటుంది. సినిమాలు, ఇతర వీడియోస్ ఆయా అగ్రిమెంట్స్ ని బట్టీ నెట్ ఫ్లిక్స్ లైబ్రెరీ నుంచీ తొలగించేస్తుంటారు.

ఓల్డ్ కంటెంట్ క్రమంగా తొలగించేస్తోన్న నెట్ ఫ్లిక్స్ కొత్త ఎంటర్టైన్మెంట్ కూడా భారీగానే సిద్ధం చేస్తోంది. జూలైతో పాటూ రాబోయే నెలల్లో అనేక సినిమాలు, సిరీస్ లు, ఇతర షోలు యాడ్ అవ్వనున్నాయి. పాతవి ఇష్టపడేవారు త్వరగా చూడటం… కొత్తవి కోరేవారు కాస్త ఓపిక పట్టడం.

జూలై నెల నుంచీ చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ల తాలూకూ సీజన్స్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండవు. అందుకే, అవేంటో ఓ సారి చూసేద్దాం. మీరుగానీ వాటిల్లో ఏవైనా చూడకపోయినా, చూడాలని అనుకుంటున్నా వెంటనే ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వెళ్లి డబుల్ క్లిక్ చేసేయండి! లేదండీ, సదరు సినిమాలు, ఇతర కంటెంట్ మిస్ అయిపోతారు.

రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్స్ గురించిన సినిమా ‘స్పాట్ లైట్’. వారు చేసిన చైల్డ్ సెక్స్ అబ్యూజ్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషనే సినిమా కథాంశం! ఇది కూడా ఇదే నెల నుంచీ నెట్ ఫ్లిక్స్ యూజర్స్ కు అందుబాటులో ఉండదు.‘ద క్రూడ్స్’ అనే యానిమేషన్ అడ్వెంచర్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ పక్కకు తప్పిస్తోంది. డిస్నీ మూవీ ‘ద ప్రిన్సెస్ అండ్ ద ఫ్రాగ్’ కూడా హిట్ లిస్ట్ లో ఉంది.

వెబ్ సిరీస్ ల విషయంలో కూడా పాత సరుకు వద్దనుకుంటోంది నెట్ ఫ్లిక్స్. ‘హింటర్ ల్యాండ్’ మొదటి మూడు సీజన్స్ ఇక పై అందుబాటులో ఉండవు. ‘గ్రేట్ డిజైన్స్’ షో విషయంలోనూ సీజన్ 10 అండ్ సీజన్ 15 లైబ్రెరీ నుంచీ మిస్ అవ్వనున్నాయి. ‘లవ్ సిక్’ అనే థాయ్ యంగ్ అడల్ట్ రొమాన్స్ విషయంలో కూడా… ఫస్ట్ సీజన్ జూలై నుంచీ అందుబాటులో ఉండదు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This