Tuesday, July 27, 2021

శేఖర్ కమ్ముల కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’ త్వరలో విడుదల

Must Read

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్‌ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవనుండడంతో విడుదలకు సిద్ధం అవుతోంది ఈ సినిమా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ సినిమా.

ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతిత్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ‘సారంగధరియా’ సాంగ్ పాత రికార్డులన్నీ తిరగరాసింది. ఈ సినిమాకి దగ్గరగా టక్ జగదీష్, విరాటపర్వం, నారప్ప సినిమాలు రానున్నట్లుగా తెలుస్తోంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This