Tuesday, July 27, 2021

“అద్భుతం” సినిమాలో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్

Must Read

హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా విభిన్నంగా ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ రోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఇంకా ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. ఈ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. మహాతేజా ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో బయటికి వస్తాయి. కాగా శివాని రాజశేఖర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో అయిపోయేది. శివాత్మిక, అడవిశేష్ ఆ ప్రాజెక్ట్ లో జంటగా నటించాల్సింది. కానీ తెలియని కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This