Friday, July 30, 2021

నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమైన పాత్ర

Must Read

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు మధ్య చక్కని స్నేహం ఉంది. సుదీర్ఘకాలంగా మంచి స్నేహితులైన వీరు ఒకరికి ఒకరు ఎప్పుడూ సహాయం చేసుకుంటారు అనే విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో నటించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే రొమాంటిక్ సినిమాలో నటించబోతున్నారు.

ఈ సినిమాలో 25 సంవత్సరాల అబ్బాయికి, 40 యేళ్ళ అమ్మాయికి మధ్య సాగే ఈ ప్రేమకథాకి మహేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. యు. వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడట. విజయ్ దేవరకొండ పాత్ర విశ్రాంతికి ముందు వస్తుందని, ఇది ఎంతో కీలకమైన పాత్ర అని అనుకుంటున్నారు. ఈ వార్తలో నిజం ఉంటే మాత్రం… ఈ మూవీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This