వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

జాక్వెలిన్‌ :బాలీవుడ్‌లో హాట్ బ్యూటీ ఇమేజ్ ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఎక్కువగా ఐటం భామ ఆఫర్లే వస్తుంటాయి. సాహోలో ప్రభాస్ సరసన ఓ పాటలో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ… టాలీవుడ్ ఆడియెన్స్‌కు కూడా దగ్గరైంది. తాజాగా ఈ భామకు మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పీరియాడిక్ మూవీలో జాక్వెలిన్‌కు బెర్త్ ఖాయమైనట్టు సమాచారం. ఇందుకోసం ఆమె 40 రోజుల కాల్ షీట్ ఇచ్చిందని తెలుస్తుంది.

 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Photo: jacquelinef143/Instagram)
Content above bottom navigation