Friday, July 30, 2021

మహారాష్ట్రలో ఓ వృద్ధ మహిళకు 9 ఏళ్ల క్రితం పోయిన కంటి చూపు..కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చింది

Must Read

మహార్రాష్ట్ర లోని ఓ వింత సంఘటన జరగడంతో ప్రజలంత షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని 9 సంవత్సరాల క్రితం ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంతో చూపు తిరిగొచ్చింది. వాషిమ్‌లోని రిసోడ్ ప్రాంతం బందర్‌వాడిలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళకు వింత అనుభవం ఎదురైంది. 70 ఏళ్ల మధురభాయ్ పదేళ్ల క్రితం కళ్లలో శుక్లాలు ఏర్పడటంతో చూపు కోల్పోయింది. మళ్లీ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు తిరిగొచ్చింది అని ఆనందపడుతుంది ఆమె. ఇది నిజామా ? కాదా? అని వైద్యులు వ్యాక్సిన్‌పై అధ్యయనం చేయడానికి సిద్ధమైయ్యారు.

జూన్ 26 న ఈ మహిళ సమీపంలో ఉన్న సమతా ఫౌండేషన్ ప్రారంభించిన టీకా కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ మొదటి డోసును తీసుకుంది. తరువాత అకస్మాత్తుగా ఈ మహిళ రెండు కళ్ళతో చూడటం ప్రారంభించింది. గత 9 సంవత్సరాలుగా కనిపించని చూపు ఒక్కసారిగా తిరిగివచ్చినట్లు తెలిపింది. ఈ విషయం విన్న అక్కడి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.

టీకా తీసుకున్న రెండవ రోజు ఒక కంటిలో 30 నుంచి 40 శాతం చూపు వచ్చిందని మధురబాయి చెప్పారు. అయితే అంతకుముందు ఆమె వైద్యులు టీకా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. బంధువుల ఒత్తిడితో ఆమె టీకా వేసుకుంది. కానీ ఒక అద్భుతం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టీకా తీసుకోవడం ద్వారా చూపు రావడాన్ని వైద్యులు ఖండించారు. వ్యాక్సిన్‌పై లోతైన అధ్యయనం చేస్తే కానీ నిజంగా కంటి చూపు వచ్చిందా.. రాలేదా అనేది తెలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మధురబాయి జీవితంలో కాంతి వచ్చింది. అది టీకా వల్ల వచ్చిందా లేదా మరేదైనా కారణంతో వచ్చిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా సంతోషంగా ఉంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This