Friday, July 30, 2021

ఏపీ కరోనా కేసులు ఇంకా ఎక్కువే…

Must Read

ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,378 సాంపిల్స్ పరీక్షించగా.. 3042 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 28 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 3,748 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. కేసులు రోజురోజుకి తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువే ఆంటున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,08, 065 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 18,61,937 కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,898 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33,230 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,25,24,187 సాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This