Friday, July 30, 2021

కరోనా అనంతరం బాధితుల్లో బోన్‌డెత్‌ రకం వ్యాధి… వైద్యులు నిర్ధారణ

Must Read

కరోనా తగ్గుతున్న బాధితుల్లో కొత్త సమస్య కొంతమందికి వస్తుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగులకు బోన్‌డెత్‌ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోన్‌ టిష్యూ డెత్‌గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో గుర్తించినట్లు ముంబైకి చెందిన హిందూజా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

కరోనా రోగులకు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చింది. తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్‌ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌ రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్‌ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

జాన్స్‌ హిప్కిన్స్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల ప్రకారం.. ఈ వ్యాధి లక్షణాలు ఇతర వ్యాధి లక్షణాలున్నట్లుగానే కనిపిస్తాయని, ఎముకల సమస్య ఉన్నట్లు కనిపిస్తాయని యూనివర్సిటీ తెలిపింది. ముందుగా కీళ్ల నొప్పులు రావడం, ఎముక, కీళ్లలో కుళ్లిపోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని పేర్కొంది. నిర్లక్ష్యం చేస్తే నొప్పి పెరిగి ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

]ఫీమర్‌ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కరోనా తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయట పడిందని డా. సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు. కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్‌ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్‌ స్టడీస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో డాక్టర్‌ సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పాటు కరోనాతో పోరాటం చేసినవారిలో ఈ బోన్‌డెత్‌ లక్షణాలు గుర్తించామని మరి కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరిగే అవకాశం ఉందని, స్టిరాయిడ్ల వాడకమైన 5-6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని వైద్యులు తెలిపారు.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో గరిష్టాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్‌డెత్‌ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని వారు అంచనా వేశారు. అయితే సంజయ్‌ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్‌ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్‌ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే వైద్యం అందించి నయం చేయవచ్చని, తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్నారు. కోవిడ్‌ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్‌ జాయింట్‌ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు వెళ్లడం తప్పనిసరి అని, అనంతరం ఏవీఎన్‌ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This