Tuesday, July 27, 2021

ర‌ష్యాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభ‌ణ… మూడో డోసు వ్యాక్సినేష‌న్ సిద్ధం

Must Read

గ‌త రెండేళ్లుగా క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలో మొద‌ట‌గా క‌రోనాకు వ్యాక్సిన్ ను త‌యారు చేసిన ర‌ష్యా ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది. క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ దేశంలో మ‌ర‌లా కేసులు పెరుగుతున్నాయి.

మూడో డోస్ ను ఇచ్చేందుకు ర‌ష్యా సిద్దం అయింది. జులై 1 వ తేదీ నుంచి రెండు డోసులు తీసుకున్న వారికి బూస్ట‌ర్ డోస్‌ను ఇస్తున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెల‌ల త‌రువాత మూడో డోస్ ఇవ్వ‌నున్నారు. అంతేకాదు, ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని పుతిన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రెండు డోసుల త‌రువాత కూడా కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This