Friday, July 30, 2021

భారతదేశంలో తగ్గిన కరోనా కేసులు…కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ వివరాలు

Must Read

నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు న‌మోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 48,698 కేసులు న‌మోద‌య్యాయి. మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్క రోజులో 64,818 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది. ఇందులో 2,91,93,085 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,95,565 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1183 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,94,493 కి చేరింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This