Tuesday, July 27, 2021

భారత్ దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Must Read

మన దేశంలో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 2 ముందు వరకు తగ్గిన కేసులు నిన్నటినుంచి మళ్లీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 48,786 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,04,11,634 కి చేరింది. ఇందులో 2,94,88,918 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,23,257 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,005 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 3,99,459 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 61,588 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 33,57,16,019 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This