Friday, July 30, 2021

కరోనా మ‌హమ్మారి ఇంకా ముగియలేదు…డెల్టాతో జాగ్ర‌త్త‌…

Must Read

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే దాదాపుగా 30 ల‌క్ష‌ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఆమెరికాలోనే అత్య‌ధికంగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. అమెరికాలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా తీవ్ర‌త ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అమెరికా 245 వ స్వ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఆ దేశ అధ్య‌క్షుడు జో బైడెన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం డెల్టా వేరియంట్లు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్నాయ‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన త‌రుణం అని జో బైడెన్ పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్‌పై విజ‌యం సాధిస్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశారు. ఏడాది కాలంగా చీక‌ట్లో మ‌గ్గుతున్నామ‌ని, త్వ‌ర‌లోనే మంచిరోజులు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This